కేసీఆర్‌పై దుమ్మెత్తిపోయడం ఆయిపోయింది.. మేడిగడ్డ పనులు ప్రారంభించిన సర్కారు?

Chakravarthi Kalyan
మేడిగడ్డలో దెబ్బతిన్న  గేట్ల తొలగింపు మొదలైంది. కత్తిరింపు వెల్డింగ్ ద్వారా గేటును కట్ చేసి తొలగిస్తున్నారు. మరో మూడు గేట్లను కూడా ఇదే తరహాలో తొలగిస్తారు. ఏడో బ్లాక్ ముందు నిన్న పడిన భారీ బుంగను పూడ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. కింద కదలికలతో నీటి ప్రవాహాలు ఉండడం, తదితరాల వల్ల బుంగలు ఏర్పడ్డాయి. వివిధ రకాల పనులు, ఇతరత్రా కారణాలతో తాజాగా ఆనకట్ట వెనకభాగంలో నీటి ఊటలు కూడా వస్తున్నాయి.  బుంగ పరిమాణాన్ని గుర్తించాక ఎంత ఇసుక అవసరం అవుతుందో తేల్చి ఆ తర్వాత ఇసుకతో బుంగను పూడుస్తారు.

మరోవైపు కుంగిన పియర్స్ కు చేపట్టాల్సిన రక్షణ చర్యలు కూడా చేపట్టనున్నారు. పియర్స్ కు మరిన్ని పగుళ్లు రాకుండా, తదుపరి దెబ్బతినకుండా అవసరమైన చర్యలపై ఆలోచిస్తున్నారు. ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన కమిటీ దీనిపై చర్చించింది. తక్షణ చర్యలు, వర్షాకాలం లోపు పూర్తి చేయాల్సిన పనులు, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షల గురించి చర్చించారు. ప్రాణహిత నీటి మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: