వ్యూహంపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌?

Chakravarthi Kalyan
టీడీపీ-జనసేన పొత్తు ఖరారు తర్వాత పవన్‌పై చాలా విమర్శలు వచ్చాయి. కేవలం 24 సీట్లకు మాత్రమే ఒప్పుకుని ఎలా రాజ్యాధికారం సాధిస్తావని పవన్‌ను విమర్శించారు. అయితే.. వారందరికీ తాడేపల్లిగూడెం సభలో పవన్‌ సమాధానం చెప్పారు. కార్యకర్తలారా నా వ్యూహాలను తప్పుపట్టవద్దన్న పవన్‌.. తనను నమ్మాలని చెప్పారు.

ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నాం.. కోట కూడా కడతామన్న పవన్‌ కల్యాణ్‌.. తాము జగన్‌ తాడేపల్లి కోట కూడా బద్దలుకొడతామన్నారు. సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు.. యుద్ధం చేసే వాళ్లు కావాలన్న పవన్‌.. యుద్ధం చేస్తేనే జగన్‌ కూలిపోతారన్నారు. ఓట్లు తీసుకువచ్చేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారన్న పవన్‌.. ప్రజల నాడి తెలియకుండా దశాబ్దం పాటు పార్టీని నడపగలమా అని ప్రశ్నించారు. దోపిడీలు చేసినా జగన్‌ను వెనుకేసుకుని వస్తున్నారని.. ఏమీ చేయకున్నా జగన్‌ను పొగిడే సమూహం ఆయనకు ఉందన్న పవన్‌.. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ప్రశ్నించే వాళ్లు నాతో నిలబడడం నేర్చుకోండని సలహా ఇచ్చారు. తాను ఒక ప్రాంత వ్యక్తిని కాదు.. ఓడినా, గెలిచినా మీతో ఉంటానని పవన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: