సీక్రెట్‌: కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తోంది అందుకేనా?

Chakravarthi Kalyan
మాజీ సీఎం కేసీఆర్‌ త్వరలోఢిల్లీ వెళ్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తొలిసారి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఇండియా కూటమికి దూరంగా ఉన్న కేసీఆర్ భాజపాతో అవగాహన ఒప్పందం కోసమే త్వరలో ఢిల్లీ వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో భారాస పనైపోయిందని.. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... మెదక్ లో కేసీఆర్ గెలిచి చూపాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లు గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
భారాస అధికారంలో ఉన్నప్పుడు అన్నింటికీ కేటీఆర్‌ను ముందు పెట్టి హరీష్ రావును డమ్మీ చేశారని.. ఇప్పుడు మేడిగడ్డ కూలిపోగానే హరీష్ రావును ముందు పెట్టారని మంత్రి ఎద్దేవా చేశారు.  కేఆర్ఎంబీ, సాగునీటి ప్రాజెక్టులపై కేటీఆర్, హరీష్ రావుకు ఏమీ తెలియదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: