హైదరాబాద్‌కు మరో ఆకర్షణ వచ్చి చేరింది?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌కు మరో ఆకర్షణ వచ్చింది. దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటైంది. దీన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం తీసుకు వచ్చేందుకు కృషి చేసిన కిషన్ రెడ్డిని అభినందిస్తున్నానన్న వెంకయ్య నాయుడు.. తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలది ప్రముఖ పాత్ర.. కళలు వినోదాన్ని పంచడమే కాదు వాటిలో విజ్ఞానం దాగి ఉంది.. కొన్ని కళలు కనుమరుగు అవుతున్నాయి.. వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అన్నారు.

నేటి తరానికి కళలను అందించాలి. యువత పాశ్చాత్య పోకడలకు దాసోహం కాకుండా కాపాడుకోవాలి.. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి.. నూతన విద్యా విధానంలో ప్రధాన మోదీ పెద్ద పీట వేశారన్నారు వెంకయ్య నాయుడు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి తప్పితే.. ఇంగ్లీష్ వాడిగా మారిపోకూడదన్న వెంకయ్య.. మాతృ భాషలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది మూర్మ్ తో పాటు తాను మాతృ భాషలోనే విద్యను అభ్యసించానని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: