బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

Chakravarthi Kalyan
వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ నేత డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 60వ డివిజన్ కార్పోరేటర్ గా డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపుమేరకు ప్రదాని నరేంద్ర మోడీ జనరంజక పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా బీజేపీలో చేరాలని ఆయన కోరారు. మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ఒక సైనికుడిలా పనిచేస్తానని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: