ఫోన్‌పే, గూగుల్ పే పని చేయట్లేదా?

Chakravarthi Kalyan
దేశంలో యూపీఐ సేవలకు కాస్త ఇబ్బంది వచ్చింది. యూపీఐ లావాదేవీలు సక్రమంగా జరగడం లేదు. దీనిపై పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి గూగుల్‌ పే, ఫోన్‌ పే, భీమ్‌, పేటీఎం వంటి యాప్‌ల వినియోగంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వర్‌ సంబంధిత సమస్యలు వచ్చాయి. దీనిపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా స్పందించింది. తమ సేవల్లో ఇబ్బందులు రావడంపై అసౌకర్యానికి చింతిస్తున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

కొన్ని బ్యాంకుల సేవల్లో సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఎన్‌పీసీఐ వ్యవస్థలు బాగానే ఉన్నాయని, సేవలు యథావిధిగా కొనసాగేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరిపామని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. నిన్న నగదు బదిలీ, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలకు ఆటంకాలు ఎదురయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: