టీడీపీతో బీజేపీ పొత్తుపై పురందేశ్వరి సంచలన ప్రకటన?

Chakravarthi Kalyan
టీడీపీతో బీజేపీ పొత్తు లేనట్టే కనిపిస్తోంది. దీనిపై తాజాగా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 175 నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని.. పొత్తులు కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని.. జనసేన మాత్రం మాతో పొత్తులో ఉందని పురందేశ్వరి అన్నారు. అంటే టీడీపీతో పొత్తు లేనట్టేనా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై తెదేపా, వైకాపాకు నిబద్దత లేదని కూడా పురందేశ్వరి అంటున్నారు.
అంతే కాదు.. పద్దతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పురందేశ్వరి తెలిపారు. అంతే కాదు.. వైసీపీపై గట్టిగానే స్వరం విప్పుతున్నారు. సిద్ధం అని పోస్టర్లు పెడుతున్నారు.. దేనికి సిద్ధం దోచుకోవడానికి సిద్దమా...తిరోగమనానికి సిద్ధమా అంటూ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నామని.. ఈ ఎన్నికలలో భాజపా రాష్ట్రంలో పుంజుకుంటుందని భావిస్తున్నామని పురందేశ్వరి అంటున్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో ప్రజలు రెండు పార్టీల పాలన చూశారని ఇకనైనా బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: