ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్‌?

Chakravarthi Kalyan
గజ్వేల్ శాసన సభ్యునిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలా 45 నిమిషాలకు శాసనసభాపతి సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. గజ్వేల్ లో గెలుపొంది కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో కాలు కారి పడడంతో ఆయన తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేశారు. అందుకే కేసీఆర్ ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయన చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. ఇవాళ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు కేసీఆర్ లాబీల్లో ఉన్న ప్రతిపక్ష నేత ఛాంబర్ లో పూజలు చేస్తారు. తర్వాత సభాపతి ఛాంబర్ లో శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభ్యునిగా కేసీఆర్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: