
బాబు, పవన్ కలిసినా ఓకే.. విడివిడిగా అయినా ఓకే?
మోదీతో మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారో ఆయనకే తెలియాలని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మోడీతో పవన్ కల్యాణ్ కు వార్నింగ్ ఇప్పించాల్సిన అవసరం వైసీపీకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ చెబితే వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో ప్రధాని మోదీ లేరని మంత్రి రాంబాబు అంటున్నారు. చంద్రబాబు భార్య పేరు చెప్పుకొని.. ఇవే తన చివరి ఎన్నికలని కన్నీళ్లు పెట్టుకొని ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.