ఏపీకి గుడ్‌న్యూస్: రూ.81 వేల కోట్ల పెట్టుబడులు?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌కు ఇది గుడ్ న్యూస్‌.. రాష్ట్రంలో రూ. 81 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు  రంగం సిద్ధం అయ్యింది.  గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే కాదు.. వీటితోపాటు మరిన్ని పెట్టుబడులకూ స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.


గ్రీన్‌ ఎనర్జీలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జ‌గ‌న్ అంటున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని.. దీనివల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని.. రైతులకు కూడా మేలు జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని.. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని.. క్లీన్‌ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని..  రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుందని జగన్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: