అమెరికా నుంచి ఫస్ట్ టైమ్‌ ఆ ఛాన్స్ కొట్టేసిన ఇండియా?

Chakravarthi Kalyan
ఓ యుద్ధనౌక మరమ్మతుల విషయంలో అమెరికా ఇండియా సాయం కోరింది. అమెరికాకు చెందిన యుద్ధనౌక చార్లెస్‌ డ్రూ రిపేరింగ్ కోసం భారత్‌ వచ్చింది. చెన్నై కాటుపల్లిలోని ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన షిప్‌యార్డ్‌లో ప్రస్తుతం ఈ యుద్ధనౌక ఉంది. అమెరికా యుద్ధ నౌక కు ఇండియా రిపేర్‌ చేయడం ఇదే తొలిసారి.

ఈ విషయాన్ని ప్రకటించిన రక్షణ మంత్రిత్వ శాఖ.. భారత్‌లో తయారీకి ఇది పెద్ద ఊతమని తెలిపింది. అమెరికా, ఇండియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొత్త కోణం అంటూ ప్రకటించింది. ఈ యుద్ధ నౌక నిర్వహణ కోసం ఎల్‌ అండ్‌ టీ షిప్‌యార్డ్‌కు అమెరికా నౌకాదళం ఆర్డర్ ఇచ్చింది. రిపేరింగ్ కోసం చార్లెస్‌ డ్రూ యుద్ధనౌక ఇండియా తీరంలో 11 రోజులు ఉంటుంది. యుద్ధనౌకల కోసం అధిక సామర్థ్యం కలిగిన డీజిల్‌ మెరైన్‌ ఇంజిన్ల రూపకల్పనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతినిచ్చిందని రక్షణ శాఖ తెలిపింది. ముందు ముందు మరిన్ని విదేశీ నౌకలకు భారత్‌లో మరమ్మతులు నిర్వహించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: