రూపాయి పతనం ఆపేందుకు ఆర్బీఐ సంచలన నిర్ణయం?
ఈ ఒక్క ఏడాదే రూపాయి విలువ 7శాతం క్షీణించింది. అంతేకాదు. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా 80పైగా రూపాయలకు పడిపోయింది. ఆర్బీఐ తగిన చర్యలు చేపట్టకుంటే రూపాయి క్షీణత ఇంకా భారీగా ఉంటుంది. అయితే.. సెప్టెంబర్‌లో
642.450 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీ మారక నిల్వలు 60 బిలియన్ డాలర్లు తగ్గాయని ఆర్బీఐ చెబుతోంది. అందుకు విలువ తగ్గటం ఒక కారణం. దీంతో పాటు అమెరికా డాలర్ల విక్రయం ఎక్కువ కారణం. విదేశీ మారకనిల్వలు తగ్గినా 580బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే
ఐదో పెద్ద దేశంగా ఇండియా ఉందని ఆర్బీఐ చెబుతోంది.