కేసీఆర్‌.. దేశం తర్వాత.. ముందు బాసర ఐఐటీ చూడు!

Chakravarthi Kalyan
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత బాసరలోనే ట్రిపుల్ ఐటీ ఏర్పడింది. వైఎస్ హయాంలో ఏర్పాటైన ఈ ట్రిపుల్ ఐటీ గ్రామీణ విద్యార్థులకు కల్పతరువుగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి వెయిటేజీ ఉండటంతో ఇక్కడ వారికి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అయితే.. ఇంతటి మంచి విద్యాసంస్థను ఇప్పుడు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రస్తావించారు. బాసర ఐఐఐటీలో అక్కడ కనీస సౌకర్యాలు లేవని.. భోజన వసతి లేదని.. 169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట రెగ్యలర్ వాళ్లు కేవలం 15 మందే ఉన్నారని.. ఈ ట్రిపుల్ ఐటీకి వీసీ అసలే లేడని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ఇదీ చదువుల తల్లి బాసర సరస్వతి చెంత త్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితి అంటూ కోట్ చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆరేమో దేశాన్ని ఉద్దరించే పనిలో బిజీగా ఉన్నాడని సెటైర్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: