ఈనెల 9న థియేటర్లలో ‘RRR’ ట్రైలర్ విడుదల..

N ANJANEYULU
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వ‌హిస్తొన్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. డిసెంబ‌ర్ 9న ఉద‌యం 10గంట‌ల‌కు ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ తెలుగు రాష్ట్రాల‌లో ఎంపిక చేసిన థియేట‌ర్ల‌లో విడుద‌ల అవ్వ‌నున్న‌ది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన అనంత‌రం యూట్యూబ్‌లో అందుబాటులోకి రానున్న‌ది. ఈ ట్రైల‌ర్ చూస్తే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానుల‌కు పూనకాలు రావ‌డం ఖాయం అని ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. దాదాపు రెండున్న‌ర నిమిషాల పాటు నిడివి ఈ ట్రైల‌ర్ ఉంటుంద‌ని తెలుస్తోంది.
ఈ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో రామ్‌చరణ్ ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.  ఈ త‌రుణంలోనే ట్రైలర్‌కు ముందే ప్రేక్షకులకు వరుస సర్‌ప్రైజ్‌లను ఇస్తుంది చిత్ర బృందం.  నిన్న సోమవారం ఈ సినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొత్త లుక్స్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరొక‌ వీడియోను పంచుకుంది. ఈ వీడియోను ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ తన ట్విట్టర్‌లో షేర్ చేసాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇందులో భాగంగా ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఓ సన్ని వేశాన్ని కట్‌ చేసి ఈ వీడియోను రూపొందించారు. పోలీస్‌ డ్రెస్‌ ధరించిన చెర్రీ మంటల్లోంచి నడుచుకురావడం ఈ క్లిప్‌లో క‌నిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ‌ వైరల్‌గా మారిన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: