ముందు నుండి తాలిబన్లకు చైనా సపోర్ట్ ఉందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ రోజు తమ ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్లు తమకు చైనా సపోర్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. తమ ముఖ్య భాగస్వామి చైనా దేశమేనని తాలిబన్ల అధికార ప్రతినిధి ముజాహిద్ తెలిపాడు. చైనా ఆఫ్గనిస్తాన్ లో పెట్టుబడులను పెట్టేందుకు దేశాన్ని పునర్ నిర్మించేందుకు సహాయపడుతుందని చెప్పారు. తమ దేశంలో విలువైన రాగి నిక్షేపాలు ఉన్నాయని వాటిని వెలికితీసే అవకాశాన్ని చైనాకు ఇస్తామని ముజాహిద్ స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే తాలిబన్లతో పొత్తుతో ముందు నుండి చైనా కూడా అనుకూల ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా ను ఎదుర్కోవాలంటే తాలిబన్లకు సైతం చైనా సపోర్ట్ ఉండాల్సిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడితే ఇరు దేశాలకు లాభం చేకూరుతున్న నేపథ్యంలోనే తాలిబన్లతో సైతం సంబంధం పెట్టుకునేందుకు చైనా సిద్దమవుతోంది.