
నిత్యామీనన్ : హీరోయిన్ కాకపోతే..ఆ పని చేసేదాన్ని ?
కాగా, ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనంతరం నిత్యామీనన్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, శర్వానంద్ వంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం సినిమాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన అద్భుతమైన నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను కూడా గెలుచుకుంది.
గతంలో ధనుష్ హీరోగా నటించిన తిరు చిత్తంబంలం సినిమాలో ఈ చిన్నదాని నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా మాట్లాడుతూ.... కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే యాంకర్ మీరు సినిమాలలోకి రాకపోయి ఉన్నట్లయితే ఏమై ఉండేవారు అని ప్రశ్నించగా.... నిత్యమీనన్ తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. ఒకవేళ నేను కనుక నటిని కాకపోయి ఉంటే జర్నలిస్ట్ అయ్యేదానినని నిత్యామీనన్ వెల్లడించారు. తన డ్రీమ్ అదేనంటూ చెప్పుకొచ్చింది. ఈ చిన్నది చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇది ఇలా ఉండగా హీరోయిన్ నిత్యా మీనన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్న సంగతి తెలిసిందే.