ఓవ‌ర్ టు చ‌ర‌ణ్ : అమ్మా నాన్నా బాబాయ్ ..

RATNA KISHORE
ఇవాళ పున్న‌మి వెలుగు అదిరిపోయింది
ఇవాళ చంద‌మామ కాంతుల‌కు కొత్త సోయ‌గం
వ‌చ్చి చేరింది గ్లామ‌ర్ నీడ్స్ గ్లామ‌ర్
లైఫ్ లీడ్స్ గ్రామ‌ర్
అవునా కాదా?
చంద‌మామ లాంటి తార‌క్
ఆయ‌న వెంట ఉండే స్నేహ గంధం
చ‌ర‌ణ్

 
అవును ఒక‌రు రాముడు
జ‌నం మెచ్చిన రాముడు
మ‌రొక‌రు..
జ‌నం నుంచి వ‌చ్చిన రాముడు
నంద‌మూరి రాముడు ... కొణెద‌ల రాముడు
అదిరిపోయింది షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు
ఈ సంద‌ర్భంగా ఎన్నో ఆస‌క్తులు..విశేషాలు
అవేంటో చూద్దాం


 
జీవితం ఇచ్చిన అమ్మ - జీవించ‌డం నేర్పిన నాన్న - అడుగు అమ్మ‌ది - న‌డ‌క అమ్మ‌ది - న‌డ‌త నాన్న‌ది. ఇదీ  చ‌ర‌ణ్ జీవితం. త‌న జీవితం పై ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌భావం ఉంది. మీ అంద‌రికీ ఆయ‌న ప‌వ‌ర్ స్టార్..మ‌రి!నాకు? దిష్టి త‌గులుతుంది..ఆ బంధం గురించి చెబితే.. తండ్రి లాంటి వాడు ఇలా చెప్ప‌డం త‌క్కువ.. తండ్రి స్థానంలో తండ్రి..స్నేహితుడి స్థానంలో స్నేహితుడు..శ్రేయోభిలాషి స్థానంలో శ్రేయోభిలాషి.. చిరు పెద్ద‌బ్బాయి ప‌వ‌న్ .. ప‌వ‌న్ అడుగుల్లో అడుగు చ‌ర‌ణ్..బాబాయ్ అంటే గౌర‌వ‌మా ? ప్రేమా? అమ్మో! ఆయ‌నేం చెప్పినా చేస్తాను. ఆయ‌నేం అన్నా వింటాను. ఆయ‌న‌ది తండ్రి స్థానం ఓ సంద‌ర్భంలో గురువు అని కూడా అనుకుంటా ను. ఇలాంటి రిలేష‌న్ గురించి గ‌తంంలోనూ చెప్పాడు ఇప్పుడూ చెప్పాడు. దిష్టి త‌గులుతుంది.. ఏమో ఇలా చెప్ప‌వ‌చ్చో లేదో అంటూ త‌మ బంధాన్ని వివ‌రించి ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశాడు. దోజ్ ఆర్ స్పెల్ బౌండెడ్ వర్డ్స్ ..ఏదేమ‌యినా ఈ రిలే ష‌న్ గురించి నేనేమీ మాట్లాడ‌లేను కొన్ని సార్లు మౌన‌మే స‌మాధానం అని చెప్పాడు చ‌ర‌ణ్ ..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: