చిరంజీవితో సినిమా... ఆ హీరోయిన్ ను వాడుకుని వదిలేశారా ?

Veldandi Saikiran
మెగా హీరో చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా మారిపోయారు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అందులో కొండవీటి దొంగ సినిమా ఒకటి. ఈ సినిమా టాలీవుడ్ లో టెక్నికల్ గా ఉన్న హద్దులన్నీ చెరిపేసి 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో 70mm లో రిలీజ్ అయింది. తర్వాత కాలంలో వచ్చిన డాల్బీ, డిటిఎస్ సౌండ్ లకు మూలం. 


చిరంజీవి నటించిన కాస్టూమ్ డ్రామాలలో ఒకటైన కొండవీటి దొంగకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి సినిమాలలో నటించే అవకాశాన్ని స్టార్ హీరోయిన్ శ్రీదేవి కోల్పోయారట. అప్పటికే శ్రీదేవి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. చిరంజీవి, శ్రీదేవి ఇద్దరూ కలిసి అంతకుముందు కొన్ని సినిమాలలో నటించారు. వీరిద్దరితో కలిసి కొండవీటి దొంగ సినిమా తీస్తే టాలీవుడ్ లోనే గొప్ప సినిమాగా నిలిచిపోతుందని నిర్మాత త్రివిక్రమ రావు భావించారట. కానీ అది కుదరలేదట.


కాగా, కొండవీటి దొంగ సినిమాలోని "శుభలేఖ రాసుకున్నా" పాట మంచి ఆదరణ పొందింది. రాధా-చిరంజీవి ఈ పాటలో అద్భుతంగా నటించారు. ఈ పాటలో ముందుగా హీరోయిన్ దివ్యవాణిని అనుకున్నారట. చిరంజీవి కూడా దివ్యవాణికి నీకు ఈ సినిమాలో ఓ పాట ఉంటుందని చెప్పారట. దాంతో దివ్యవాణి చాలా సంతోష పడిందట. 


చివరికి స్క్రిప్ట్ మార్చేసారట. దివ్యవాణి కోసం అనుకున్న పాటను హీరోయిన్ రాధతో చేయించారట. ఆ సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ విషయాన్ని నేరుగా దివ్యవాణితో చెప్పాడట. ఆ పాట నువ్వే చేయాల్సింది కానీ మేము ఏమి చేయలేకపోయామని అన్నాడట. దాంతో దివ్యవాణి చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: