ఏపీ: కూటమి పాలనపై గ్రౌండ్ రిపోర్ట్.. చంద్రబాబు డేర్ డెసిషన్..!
ఇందుకోసం క్షేత్రస్థాయిలో కూడా రాబిన్ శర్మ టీం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారట. అలాగే ప్రభుత్వ పథకాల నిర్ణయాలు ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రాబిన్ శర్మ కూటమి ప్రభుత్వానికి సహాయంగా పనిచేయబోతున్నారట. రాబిన్ టీంలో చాలా కీలకంగా ఉన్న అనంత్ తివారి నేతృత్వంలో ఈ కొత్త బృందం ఏర్పడబోతోందట. అలాగే ప్రభుత్వంలోని మంత్రులు కూటమి నేతలు ఎలా పని చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి సిద్ధమయ్యారట.
ఇప్పుడు కి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి రాబిన్ శర్మ టీం రంగంలోకి దించబోతున్నారట. అయితే ఇదివరకే క్షేత్రస్థాయిలో పబ్లిక్ మూడ్ పైన కూటమి ప్రభుత్వానికి అలర్ట్ ఇస్తూ ఒక నివేదిక కూడా ఇచ్చిందట. ముఖ్యంగా పథకాల ఎఫెక్ట్ గ్రౌండ్ లెవెల్ లో చాలానే ఉన్నట్లు చెప్పడంతో త్వరలోనే ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి కూడా రాబోతున్నట్లు రాబిన్ శర్మ టీం తో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు పెంచుతున్నారని విషయం పైన రోడ్ల విషయం పైన కూడా సూపర్ సిక్స్ హామీల పైన కూడా రాబిన్ టీం ఒక నివేదికను ఇచ్చినట్లు సమాచారం.