విజయవాడ చిట్టి నగర్ కు చెందిన మౌలానా నజీర్ కూతురు తస్నీమ్ ఫాతిమా గత నెల తొమ్మిదవ తారీఖున అదృశ్యం అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ గ్రామానికి చెందిన వాసిఫ్, తయ్యాబ్ లు తమ కుమార్తెను కిడ్నాప్ చేసారని పిర్యాదు చేసారు ఫాతిమా తల్లిదండ్రులు. విజయవాడ నుంచి పోలీసులు, ఫాతిమా తల్లిదండ్రులు బయల్దేరి వెళ్లి సహారంగ్ పూర్ చేరుకున్నారు. అక్కడ లోకల్ పోలీసులతో కలిసి విచారణ చేయగా హత్ని కుండ్ డ్యామ్ వద్ద చంపి పడేసినట్టుగా గుర్తించారు. గడిచిన మూడు రోజులుగా గజ ఈతగాళ్లు సహాయంతో డ్యామ్ లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఎట్టకేలకు నేడు ఉదయం మృత దేహం లభ్యం అయ్యింది. మృత దేహాన్ని విజయవాడ కు తీసుకు రవాలా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకొని ఫాతిమా తల్లిదండ్రులు కేసును పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.