హైదరాబాద్ గుండెలపై ఫార్మా కుంపట్లు?

Chakravarthi Kalyan
హైదరాబాద్ శివార్లలో ఫార్మా సంస్థల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. తాజాగా జిన్నారం మండలం గడ్డ పోతారంలోని పారిశ్రామిక వాడలో ఓ ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో పరిశ్రమ పరిసరాల్లో మంటలు వ్యాపించి.. భయాందోళనలతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఆందోళనకు గురిచేసింది. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్ లో సాల్వెంట్ ను అన్ లోడ్ చేస్తుండగా స్పార్క్ రావడంతో ఒకేసారి ట్యాంక్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయని చెబుతున్నారు.
ప్రొడక్షన్‌ బ్లాక్ లో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకుని.. మంటలు, కమ్ముకున్న పొగలతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు  గాయాలు కాగా.. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో  హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి  తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: