ఎక్కువ యాక్సిడెంట్లుకు గురయ్యే డేంజర్ కార్లు ఇవే?

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో చాలా దేశాల వాహన తయారీదారులు అందించే అనేక ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి. ఇందులో సూపర్ ఫీచర్లు ఇవ్వబడ్డాయి. కానీ భద్రత పరంగా మాత్రం వేరే ఎంపికల కంటే చాలా వెనుకబడి ఉన్నాయి.గ్రాండ్ నియోస్ ఐ-10 కారును హ్యుందాయ్ కంపెనీ అందిస్తోంది. చాలా మంచి ఫీచర్లనేవి వున్నా ఈ కారు భద్రత పరంగా మాత్రం చాలా తక్కువ రేటింగ్‌ను పొందింది. హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ ఐ-10 పెద్దలకు రెండు స్టార్ రేటింగ్, చిన్న పిల్లలకు రెండు స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది.అలాగే ఆల్టో కె-10 దేశంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే కారుగా నిలిచింది. అయితే ఈ కారులో మాత్రం చాలా తక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అందువల్ల క్రాష్ టెస్ట్‌లో ఇది చాలా తక్కువ రేటింగ్‌ను కూడా పొందింది. ఈ మారుతి ఆల్టో K-10 గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలకు రెండు, చిన్న పిల్లలకు జీరో రేటింగ్‌ను అందుకుంది.ఇక గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో మారుతికి చెందిన మరో వాహనం ఇగ్నిస్ కూడా చాలా తక్కువ రేటింగ్‌ను అందుకుంది .మారుతి ఇగ్నిస్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలకు ఒకటి, చిన్న పిల్లలకు సున్నా రేటింగ్ ని మాత్రమే పొందింది.


అలాగే మారుతి S ప్రెస్సోను మారుతి చాలా ఎంపికలలో  అందిస్తోంది. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో కంపెనీకి చెందిన ఈ కారు చాలా తక్కువ రేటింగ్‌ను  పొందింది. మారుతి S ప్రెస్సో గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలకు ఒక స్టార్, చిన్న పిల్లలకు జీరో రేటింగ్‌ను మాత్రమే పొందింది.స్విఫ్ట్‌ను మారుతి భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుగా వస్తుంది. కానీ ఈ కారు భద్రత పరంగా  చాలా తక్కువ రేటింగ్‌ను పొందింది. NCAP క్రాష్ టెస్టింగ్ సమయంలో మారుతి స్విఫ్ట్ పెద్దలకు ఒక స్టార్ ఇంకా చిన్న పిల్లలకు ఒక స్టార్ రేటింగ్ పొందింది.అలాగే మారుతి వ్యాగన్ ఆర్ కారును మారుతి హ్యాచ్‌బ్యాక్ కారుగా మార్కెట్లో రన్ అవుతుంది. మారుతి కంపెనీకి చెందిన ఈ కారును భారతీయులు చాలా కాలంగా ఇష్టపడుతున్నారు. కానీ మారుతీ వ్యాగన్ ఆర్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో పెద్దలకు ఒకటి ఇంకా చిన్న పిల్లలకు జీరో రేటింగ్ పొందింది.ఈ కార్లు ఎక్కువ యాక్సిడెంట్లుకు గురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: