కొత్త ఫీచర్స్ తో బజాజ్ పల్సర్ బైక్ వచ్చేసింది..ధర కూడా..!

Satvika
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ కు మంచి డిమాండ్ ఉంది.. ఎన్నో రకాల బైక్ లను ఈ కంపెనీ విడుదల చేస్తూ వస్తుంది..సరసమైన ధరలకు అదిరిపోయే ఫీచర్లు ఉండటంతో యువతకు బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సేల్స్ భారీగా అయ్యాయి. ఈ తరుణంలో కంపెనీ మరో కొత్త బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇంక అస్సలు ఆలస్యం లేకుండా ఆ బండి పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం.. భారత మార్కెట్లో ప్రస్తుతం విక్రయిస్తున్న పల్సర్ సిరీస్లో తాజాగా మరో కొత్త మోడల్ను లాంఛ్ చేసింది. ఎన్ఎస్125 పేరుతో ఈ బైక్ భారత మార్కెట్లోకి విడులైంది.


124.45 సిసి ఇంజిన్తో పనిచేసే ఈ సరికొత్త బైక్ ధరను రూ. 93,690 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. బజాజ్ కొత్త 125 సిసి బైక్‌ బీచ్ బ్లూ, ఫైరీ ఆరెంజ్, బర్న్ రెడ్, ప్యూటర్ గ్రే అనే నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పల్సర్ సిరీస్లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని బైక్లలో కన్నా ఇదే అత్యంత సరసమైన, తక్కువ సీసీ కలిగిన బైక్ కావడం విశేషం. యూత్ ను టార్గెట్ చేసుకున్న ఈ కంపెనీ ఈ కొత్త బైక్ ను లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.


మార్కెట్లో ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్ల ప్రారంభ ధరలు వరుసగా రూ. 1.11 లక్షలు, రూ. 1.35 లక్షలుగా ఉన్నాయి. ఈ కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 బైక్లో బిఎస్ 6 కంప్లైంట్ 125 సిసి డిటిఎస్-ఐ ఇంజిన్ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 12 బిహెచ్ పవర్ను, 7000 ఆర్పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఇంజిన్ మార్పు మినహా, డిజైన్ పరంగా చూస్తే ఇది అచ్చం పల్సర్ ఎన్ఎస్ 160 లాగే ఉంటుంది.అధిక వేగంతో ప్రయాణిస్తున్న సందర్భంలోనూ మంచి స్థిరత్వాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.పల్సర్ 125 ఎలాగైతే క్రేజ్ ను సంపాదించుకుందో అంతకు మించి కొత్త ఎన్ఎస్ 125 బైక్ కూడా బజాజ్ స్థానాన్ని మరింత పెరిగేలా చేస్తుందని బజాజ్ సంస్థ వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: