ఆషాఢమాసం అంటే కొత్తగా పెళ్ళైన మహిళలకు ఇష్టమట ? ఎందుకో ?

VAMSI
ఆషాడ మాసం అనగానే కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో ఈ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ఈ నెల అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. అయితే ఈ మాసంలో మన ఆచార వ్యవహారాల ప్రకారం కొత్త కోడలు, అత్త కొన్ని రోజుల పాటు కలిసి ఒకే ఇంట్లో ఉండరాదని చెబుతారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ సంప్రదాయాన్ని  పాటించడం పరిపాటి. అయితే దీని వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నాయి అంటుంటారు మన పండితులు.
 
కొత్త గా పెళ్లయిన అమ్మాయిలు అత్తంటి లో ఉండకూడదు అంటారు... అందుకనే అత్తింటి నుండి పుట్టింటికి వెళ్ళిపోతారు. ఆషాఢ మాసం వెళ్ళే వరకు కూడా... పుట్టింట్లోనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇందుకే ఆషాడ మాసం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఆషాఢ మాసం వస్తే చాలు బోనాల జాతర, గోరింటాకు అంటూ కొత్తగా పెళ్లైన వధువుకు పుట్టింటికి వెళ్ళడానికి ఇలా ఎన్నో తంతులు ఉన్నాయి ఈ ఆషాడ మాసంలో.
అంతే కాకుండా ఈ మాసం లో నవ దంపతులు కలవకూడదనే ఆచారాన్ని కూడా మన దేశం లోని హైందవేతర మతస్తులు కూడా కొన్ని చోట్ల పాటిస్తున్న విషయం తెలిసిందే. కానీ భర్తకు భార్యను చుడాలనిపిస్తే మాత్రం ఎప్పుడైనా వెళ్లొచ్చని అదే దర్మం చెబుతోంది. అలా అత్తింటికి వెళ్లిన అల్లుడికి స్వీట్స్, బట్టలు పెట్టి సకల మర్యాదలను చేసి ఇంటికి పంపిస్తారట. ఆషాఢ మాసం అనేది సంవత్సరంలో నాలుగో మాసం. ఈ మాసం లో గృహ నిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అనునది మత్స్య పురాణము. ఈ మాసంలో ఒకసారైనా ఆడ పిల్లలు ముఖ్యంగా వివాహితలు గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఇక ఆషాఢ మాసం పెళ్లిళ్లకు సరైన సమయం కాదన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: