అమ్మ: గర్భంతో ఉన్నపుడు శరీర అవయవాలు కలిగే మార్పులివే..!

N.ANJI
గర్భం దాల్చడం అనేది మహిళకు ఎంత గొప్ప వరం. గర్భధారణ సమయంలో గర్భిణుల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. గర్భం దాల్చిన తర్వాత కడుపులోని బిడ్డ పెరుగుదలలో వస్తూ ఉంటాయి. ఇలా కేవలం కడుపులోని బిడ్డకు మాత్రమే జరగదు. గర్భం దాల్చిన మహిళ శరీర అవయవాలలోనూ మార్పు జరుగుతుంది. అవి ఏంటో చూద్దామా.
అయితే కడుపులో బిడ్డ ఎదుగుదల మొదలైనప్పటి నుండి గర్భంతో ఉన్న మహిళ శరీర అవయవాలలో ఎటువంటి మార్పు ఉంటుంది. అవయవాలు కదులుతున్నప్పుడు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టమే కానీ, బయటకు పెరుగుతున్న గర్భం మాత్రమే మనం చూడగలుగుతున్నాం, అలాగే లోపల ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు చూడని, నమ్మలేని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
ఇక గర్భం దాల్చిన తర్వాత నెలలు గడిచేకొద్దీ బిడ్డ పెరుగుదల క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతున్నపుడు మహిళ శరీర అవయవాలలో కూడా మార్పు వస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, గుండెల్లో మంటగా ఉండటం, పిత్తాశయంలో సమస్యలు, కాళ్ళ వాపులు ఉంటాయి.
అంతేకాదు కడుపు సైజు పెరుగుతున్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్, కొన్నిసార్లు చర్మం ప్రకాశవంతం ఉండటం, కొన్నిసార్లు ప్రకాశవంతం లోపించడం కనిపిస్తూ ఉంటాయి. అవయవాల సైజులో మార్పు కారణంగా ఈ విధంగా ఉంటే ప్రతి పది నిముషాలకు లేదా ఇరవై నిముషాలకు జీర్ణాశయ సమస్య కారణంగా బాత్ రూమ్ వెళ్లడం జరుగుతుంది.
ఇక గర్భంలోని బిడ్డ సైజు పెరుగుతున్నప్పుడు సాధారణంగా కంటే ఎక్కువగా అవయవాలు మార్పు జరిగినప్పుడు ఎలా ఉంటుందో పైన వీడియో చూశారు కదా. అలాగే బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కొందరు మహిళలు అలాగే లావుగా ఉండటం, కొందరిలో బరువు తగ్గడం చూస్తూ ఉంటారు. ఇలా మహిళల శరీరం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: