ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సలార్ టు సినిమా వల్ల వీళ్ళిద్దరి కాంబో లో రావలసిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది అన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరి అనుమానాలకి ఫుల్ స్టాప్

 పెడుతూ వారిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఆగస్టు నెల నుండి సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తాము అని పేర్కొన్నారు. ఆగస్టు నుండి సినిమా స్టార్ట్ చేస్తే 2026 సమ్మర్ లోగా సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .అయితే వీళ్ళిద్దరి కాంబోలో వచ్చే సినిమా  భారీ
 బడ్జెట్ తో వస్తుంది అని అంటున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఇదిలా ఉంటే ఇక దేవర

 నుండి ఇటీవల ఫస్ట్ సింగిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ప్రశాంత్ సలార్ 2  సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇకపోతే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాకి డ్రాగన్ అనే ఒక సరికొత్త టైటిల్ ను పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకునే అంశాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు . ఇదిలా ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కి కూడా సిద్ధమైన సంగతి తెలిసిందే. త్వరలోనే వాటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం వస్తాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: