కెమెరాకు చిక్కిన కత్రినా బేబీ బంప్ ఫొటోస్..!!

murali krishna
సెలబ్రిటీలు పెళ్లిళ్ల గురించి, ప్రగ్నెన్సీల గురించి సోషల్ మీడియాలో నిత్యం వందల రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి.సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకముందు కొన్ని రూమర్స్, పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రూమర్స్ వాస్తు ఉంటాయి.తాజాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ గురించి రకరకాల వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కత్రినా కైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ కొన్ని పుట్టుకొచ్చాయి.బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తల్లి కాబోతుంది అని గత కొన్ని నెలల నుండి ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై కత్రినా కైఫ్ కానీ విక్కీ కౌశల్ కాని స్పందించి ఇది నిజమే లేకపోతే ఇది నిజం కాదు అని ఒక మాట కూడా స్పందించడం లేదు.అయితే తాజాగా ఈ వీడియో చూస్తే మాత్రం కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నది నిజమే అనుకుంటారు చాలామంది జనాలు.అయితే సౌత్, నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించిన హీరోయిన్ కత్రినా కైఫ్ తన అభిమాని అలాగే నటుడు అయినటువంటి విక్కీ కౌశల్ ని 2020లో పెళ్లాడింది. ఇక పెళ్లయ్యాక ఈ జంట సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది.అయితే తాజాగా కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇక ఈ మధ్యనే తన భర్త విక్కీ కౌశల్ బర్త్ డే రోజు కత్రినా కైఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో విక్కీ కౌశల్ ఫొటోస్ షేర్ చేసి మూడు లవ్ సింబల్స్,మూడు కేక్ సింబల్స్ ని క్యాప్షన్ గా పెట్టింది.దీంతో ఇది గమనించిన చాలామంది నెటిజన్స్ 3 సింబల్స్ పెట్టడానికి కారణం నువ్వు ప్రెగ్నెంటా ఏంటి అని కొంతమంది కత్రినాను కామెంట్స్ లో అడుగుతున్నారు.

 అలాగే తాజాగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కి సంబంధించిన వీడియో కూడా మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇక అందులో ఏముందంటే.. విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ఈ మధ్యనే లండన్ కి వెళ్లారు. అయితే అక్కడ జనాలకు వీరు తెలవకపోవడం కారణంగా చాలా జాలిగా ఈ జంట పబ్లిక్ గానే తిరుగుతున్నారు.అయితే ఓ వ్యక్తి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ లండన్ లో తిరుగుతున్న సమయంలో వారికి సంబంధించిన వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ వీడియోలో బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకున్న కత్రినా కైఫ్ పొట్ట చాలా ఎత్తుగా కనిపిస్తోంది.దీంతో కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అనడానికి ఇదే ప్రూఫ్ అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ హీరోయిన్ కూడా ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇవ్వకుండా బిడ్డ పుట్టాక యామి గౌతమిలాగా అసలు సీక్రెట్ బయట పెడుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: