పెసర పునుకుల బిర్యాని

Durga
కావలసిన పధార్థాలు : బాస్మతిబియ్యం : అరకిలో బిర్యానీ ఆకులు : రెండు అల్లంవెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్లు ఉల్లిపాయ : ఒకటి నూనె : సరిపడా యాలకులు : నాలుగు లవంగాలు : 8 దాల్చినచెక్క : రెండు అంగుళాలముక్క పచ్చిమిర్చి : ఎనిమిది కొత్తిమీర తురుము : కప్పు నెయ్యి : టేబుల్ స్పూను ఉప్పు : తగినంత పుదీనా : అరకప్పు తయారు చేయు విధానం : పెసలు రెండుటంట ముందే నానబెట్టాలి. నానిర పెసలు కాస్త బరకగా రుబ్బుకుని ఉప్పు కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరవాత రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు చిన్న పునుకులుగా వేసి వేయించాలి బాస్మతి బియ్యం కడిగి పది నిమిషాలు నానబెట్టాలి.   మందపాటి గిన్నెలో నెయ్యి వేసి కాగాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత అల్లంవెల్లుల్లి, పుదీనా, వేసి వేగిన తరవాత కడిగి వుంచిన బియ్యం వేసి రెండు నిమిషాలు వేయించాలి.తరవాత సరిపడా నీళ్ళు పోసి ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. సగం ఉడికిన తరవాత వేయించి పెట్టుకున్న పెసరపునుకులు, కొత్తిమీర వేసి కలిపి ఆవిరిపోకుండా మూతపెట్టి సన్నని సెగమీద ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: