అమ్మ : అమ్మ కావాలనే ప్రతి మహిళ ఇలా చేస్తే పిల్లలు తప్పకుండా పుడతారు... !!!
తల్లి అవ్వడం, బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవడం కోసం ప్రతి మహిళ తాపత్రయపడుతుంది. అయితే కొంతమందికి పెళ్లి అయ్యి చాలా కాలమే అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని, గర్భం దాల్చినా మధ్యలోనే మిస్ క్యారేజ్ అవుతోందని చాలామంది మహిళలు, దంపతులు బాధపడుతూ ఉన్నారు. గర్భం రావాలంటే ఇద్దరి మధ్య సరైన కలయిక మాత్రమే కాదు, కొన్ని ఆహారాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడ చెప్పుకునే ఆ ఆహారాలు తీసుకోవడం వలన గర్భం దాల్చడానికి, పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి సహకరిస్తాయని చెబుతున్నారు.
గర్భం దాల్చడానికి, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడానికి తరచూ ఫ్రూట్స్, పచ్చని కూరగాయలు తీసుకోవాలని అందరూ చెబుతూ ఉంటారు. ఐతే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది చాలామందికి సరైన క్లారిటీ లేదు. దానిమ్మ, కొబ్బరి, బచ్చలికూర, బాదంపప్పు, అవకాడో, ఆరంజ్, స్ట్రాబెర్రీ, కాలీఫ్లవర్ త్వరగా గర్భాన్ని కలిగిస్తాయి. అలాగే దానిమ్మ పండు తినడం గర్భాశయానికి రక్తసరఫరాను పెరిగేలా చేస్తుంది. ఈ పండ్లు మగవారు కూడా బాగా తినడం వలన వీర్యవృద్ధికి సహాయపడుతుంది.కొందరిలో వయస్సు పెరిగే కొద్దీ లేదా ఒకరినొకరు ఏకాంతంగా కలిసే సమయంలో చాలా భయపడుతూ ఉంటారు. దీని కారణంగా లైంగిక కోరికలపై ప్రభావం కలిగి శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది.
అందుకని కొబ్బరి పదార్థాలు, ఆలివ్, ఆలివ్ ఆయిల్ తో తయారుచేసుకున్న ఆహారాన్ని తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే అన్ మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ మహిళల శరీరానికి చాలామంచివి.గర్భం త్వరగా ఉపయోగపడేవాటిలో గింజ ఉత్పత్తులు మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులు తినడం చేయాలి. ఉడకబెట్టిన శనగలు, సోయా బీన్స్, చిలగడదుంపలు, బంగాళా దుంపలు, బ్రోకలీ, బీట్ రూట్, అరటిపండ్లు, బాదం, గుడ్లు..ఈ ఆహారాలు పిల్లలు త్వరగా కలగడానికి సహాయం చేసే ఆహారాలు.అలాగే నువ్వులు ఆహారంలో భాగంగా వాడాలి.. నువ్వులు అండ్ బెల్లంతో కలిపినా ఉండలు మంచి పోషకాలని ఇస్తాయి..