విజయం మీదే: విడిపోతున్న భార్య భర్తలు ఇవి తెలుసుకోండి?

VAMSI
ఈ అందమైన సృష్టిలో భార్య భర్తల బంధం ఇంకా అందమైనది. వారి వల్లే ఈ సమాజం, వారే వల్లే కుటుంబం , వారి వల్లే బంధాలు, అనుబంధాలు. అలాంటిది చాలా మంది భార్య భర్తల మధ్య బంధాన్ని నేటి కాలంలో చాలా సునాయాసంగా తెగదెంపులు చేసుకుంటున్నారు. సంసారం అనే సాగరంలో అసలైన విజయం ఏమిటి అంటే భార్య భర్తలు చివరి వరకు తమని తాము అలాగే కుటుంబాన్ని కలిసి సంతోషంగా నడిపించినపుడే. అయితే నేటి మోడ్రన్ కాలంలో భార్యా భర్తల బంధం చాలా పలుచవడింది. అందుకే సులువుగా తెంపేసుకుని ఎవరి జీవితం వారిది అన్నట్టుగా బ్రతుకుతున్నారు.

 అలాగే పెళ్లి బంధాన్ని గౌరవించి చివరి వరకు అంతే ప్రేమగా జీవించే వారి సంఖ్య కూడా ఎక్కువే. కాగా వీరు విడిపోవడానికి పెద్ద కారణాలు ఉంటే పర్వాలేదు. కానీ...కొందరు అయితే చాలా చాలా చిన్న విషయాలకు , చిన్నపాటి మనస్పర్ధలకు కూడా విడాకులు తీసుకుని వేరైపోతున్నారు . అయితే ఇది ఎంత వరకు సమంజసం ఎంత వరకు ఆమోదయోగ్యం అంటే అది వారి ఇంగితానికే వదిలేయాలి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల్ని కాదు రెండు కుటుంబాల్ని కూడా ఒకటి చేస్తుంది. ఈ సమాజం ముందుట వారు కలిసి జీవించడం మొదలుపెడతారు. అలాంటిది కొందరు కొన్నాళ్ళ కాపురం తరవాత చిన్న చిన్న కారణాల వలన విడిపోతున్న సందర్భాలను చాలానే చూశాం.

ముఖ్యంగా ఒకరి మాటకు మరొకటి గౌరవం ఇవ్వాలి, తమ మనసును ఎరిగి మసులుకోవాలి అని అయితే ఇక్కడ ఈ పాయింట్స్ ఎపుడైతే ఒకరు మరికరితో  బ్రేక్ చేస్తారో అసలు సమస్య సమస్య మొదలవుతుంది. అవి చిలికి చిలికి గాలివానగా మారి ఎవరు తగ్గకపోవడంతో చివరికి విడిపోవడం అనే నిర్ణయాలు తీసుకోవడం వంటి కుటుంబాలలో చాలానే చూశాం. అయితే మనం ఇక్కడ అర్దం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే గురువు దండిస్తే  శిక్షను స్వీకరిస్తాం, బయట ఎవరైనా ఏమైన అంటే సర్దుకుని  మసులుతాం , ఉద్యోగం చేసే చోట బాస్ తిడితే ఎంతైనా బాధపడతాం అలాంటిది భార్య భర్తలు మాత్రం ఎందుకు విడిపోవాలి ఇలాగే సర్దుకుని జీవించవచ్చు కదా. ఇగో కి పోకుండా ఆత్మ గౌరవాన్ని చంపుకోకుండా, అర్దం చేసుకుని కాస్త ప్రశాంతంగా ఆలోచించి సర్డుకుంటే మళ్ళీ అంతా మామూలు అయిపోతాయి. ఇంత మాత్రానికి చాలా మంది విడిపోతున్నారు అలా కాకుండా జీవితాలను సంతోషంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: