విజయం మీదే: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది...

VAMSI
ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అన్న కొటేషన్ అందరూ చాలా సార్లు వినుంటారు. ఇది కేవలం ఒక మంచి కొటేషన్ మాత్రమే కాదు నిజం కూడా, ఒక చిన్న ఆలోచన మన భవిష్యత్తును మార్చగలదు. నిజంగానే ఒక చిన్న ఆలోచన అనూహ్యంగా మన జీవితాన్నే మలుపు తిప్పగలదు. విజయం బాటలో మనల్ని నడిపించి లక్ష్యాన్ని సాధించేలా చెయ్యగలదు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకు అలాగే సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోకు అన్న పెద్దల మాటలు ఎల్ల వేళలా గుర్తుంచుకోవాలి. మనం నడిచే ప్రతి దారి పూల దారి కావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకవేళ ముళ్ళు ఎదురైతే ఇక ఆ ప్రయాణాన్ని అంతటితో ఆపేసి వెనుతిరగాలి అనుకోవడం మాత్రం తప్పే అవుతుంది.
కష్ట సమయాలలో దైర్యంగా నిలబడి పోరాడాలే తప్ప భయపడి అనాలోచితంగా వెను తిరిగి ఓటమిని అంగీకరించకూడదు. ఏ దారి లేదు అన్న సమయంలో కూడా...మీ ఆలోచన మీకు దారి చూపిస్తుంది. మీకు కష్టం వచ్చిందా..సమస్య ఎదురయ్యిందా ఎం చేయాలో పాలుపోలేదా..!! అయితే ఒకసారి మనస్సుని కాస్త ప్రశాంతంగా ఉంచి ఆలోచించండి, ఒకటికి పదిసార్లు సమస్యను ఎలా పరిష్కరించగలరో ఉపాయం ఆలోచించండి, తప్పకుండా ఎదో ఒక ఆలోచన వస్తుంది. ఆ తర్వాత అది ఎంత వరకు కరెక్ట్ అన్నది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా విజయం అందుతుంది, సఫలం అవుతారు అని చెప్పలేము కానీ వీలైనంత వరకు మీ సమస్య తీరే మార్గం కనిపిస్తుంది.  
కొండపై ఉన్న ఆ నారాయనుడిని దర్శించుకోవాలి అంటే బాబోయ్ ఇన్ని మెట్లు ఎక్కాలా అని మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతే...మీ అడుగు మొదటి మెట్టు వద్దే ఆగిపోతుంది. ఇక దైవ దర్శనం ఎలా జరుగుతుంది. ఎలా మీ నొప్పిని తగ్గించుకుని ముందుకు నడవాలని ఆలోచించాలి, ఆలోచించి దాన్ని అమలులోకి తీసుకురావాలి. అందుకే ఆలోచన అనేది మనిషి విజయానికి తొలి మెట్టు అని కూడా అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: