విజయం మీదే: మీ విజయానికి ఆ ఒక్కటి అడ్డు పడుతోందా ?

VAMSI

ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా సాగుతూ ఉంటుంది. కొందరు ఏమీ లేకున్నా చాలా సంతోషంగా జీవిస్తుంటారు. మరి కొందరు అష్ట ఐశ్వర్యాలలో మునిగి తేలుతున్నా కాసేపు కూడా ఆనందంగా జీవించలేరు. ఎంత కుబేరులు అయినా నిజానికి సంతోషం లేని జీవితానికి ఎటువంటి విలువ ఉండదు. ఎంత సౌకర్యవంతమైన జీవితం అయినా ఆనందం లేనప్పుడు శూన్యం గానే కనపడుతుంది. చాలా మంది తమ స్వయంకృతం అపరాధాల వలన తమ సంతోషాన్ని తామే దూరం చేసుకుంటుంటారు. అటువంటి పొరపాట్లలో ప్రధానంగా కనిపించేవి చెడు ఆలోచనలు, స్వార్థం వంటి భావాలు. మనిషి యొక్క చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణమన్నారు గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్. మన చెడు ఆలోచనల వలన సంతోకరమైన వాతావరణంలో కూడా ఆనందంగా ఉండలేము. వీటి ద్వారా లైఫ్ లో మనము అనుకున్నది సైతం సాధించలేము.
అందుకే నెగిటివ్ గా ఆలోచించడం మానేయాలి, మెల్లగా నెగటివ్ థింకింగ్ నుండి బయటపడి పాజిటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నించాలి. అంతా మన మంచికే అనుకుని ముందుకు సాగితే పేదరికంలోనూ ఎంతో కంఫర్ట్ గా జీవించవచ్చు. అలా కాకుండా ప్రతి సందర్భంలోనూ చెడు ఆలోచనలతో సతమతమవుతూ మంచిని చూడలేకపోతే అవే మనకు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయో అప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి నెగటివ్ ఆలోచనలను మన నుండి పారద్రోలితేనే ఇది సాధ్యమవుతుంది.
అన్ని నష్టాలకు కారణమైన నెగటివ్ ఆలోచనలు మన నుండి దూరమవ్వాలంటే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది.
ప్రతి రోజూ మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఒక అరగంట అయినా ఏదో ఒక వ్యాయామం  చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా పాజిటివ్ ఆలోచనలు పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది.
మనసుకు నచ్చిన పనులను మాత్రమే చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవరి వల్లనో మనకు నచ్చని పనులు చేయకూడదు. ఇది మీలో నెగటివ్ ఆలోచనలను మీకు తెలియకుండానే పుట్టడానికి సహాయపడుతుంది.
ఖాళీ సమయంలో మంచి మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోండి. పుస్తకాలు మనలోని నెగటివ్ ఆలోచనలను పారద్రోలి పాజిటివ్ ఆలోచనలను పెరిగేలా చేస్తాయి.
పై విషయాలను గమనించి అనుసరించండి.  విజయాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: