విజయం మీదే : కలలపై నమ్మకం ఉంచితే విజయం మీ సొంతం ... !
జీవితంలో చాలామంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కలలు నిజం చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో కొందరు పిల్లలకు మంచి చదువు చదివించాలని, పెద్ద కారు కొనాలని, ఘనంగా వివాహం చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఇంకా ఎన్నో ఆశలను నిజం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. మనకు రోజూ వచ్చే కలలలో కూడా లోతైన అర్థాలు దాగుంటాయి.
కలలు మన ఆలోచనలకు ప్రతిబింబాలు. మన మెదడు లోతుల్లోని భావాలను మనకు చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కలలు కంటే సరిపోదు ఆ కలలను నిజం చేసుకోవటానికి నిరంతరం శ్రమించాలి. కన్న కలలతో కొత్త లక్ష్యాలను ఎంచుకుంటూ గతంలో జరిగిన పొరపాట్లను అనుభవంగా మలుచుకుంటూ ముందడుగులు వేయాలి. కన్న కలలకు తగినట్లు అవకాశాలు అందిపుచ్చుకుని కొత్త ప్రపంచం తలుపులు తెరవాలి.
మన కలలపై మనం పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచాలి. ఆ కలలను నిజం చేసుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో విజయం దక్కుతుంది. కలలను నెరవేర్చుకోవడంలో కొన్నిసార్లు ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయి. అలాంటి సమయంలో నిరాశానిస్పృహలకు లోను కాకుండా కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మనసు మాటలు వింటూ కలలను సాకారం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తే విజయాలను సాధించటంతో పాటు మరో మెట్టు ఎక్కించే ఎన్నో విషయాలను కూడా నేర్చుకోవచ్చు.