Ratan tata: నింగికెగిసిన ఆశాజ్యోతి.. రతన్ టాటా ఇకలేరు..!
అప్పటినుంచి రతన్ టాటా గారు తన ప్రయాణంలో ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదట. పదివేల కోట్లతో ప్రారంభమైన ఈ టాటా పారిశ్రమ ఇప్పుడు లక్షల కోట్లకు తీసుకు వెళ్లడంలో ఆయన కృషి చాలానే ఉందని చెప్పవచ్చు. ఇండియాలోని అత్యంత గౌరవమైన పారిశ్రమ వేత్తగా పేరు పొందిన రతన్ టాటా గ్రూప్స్ ఎన్నో విజయాలను కూడా సాధించింది. 2000 సంవత్సరంలో పద్మభూషణ్ 2008లో పద్మ విభూషణ్ సైతం అందుకున్నారు. రతన్ టాటా మరణించారనే వార్త టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తెలియజేశారు.
రతన్ టాటా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా అందించిన ఘనత అందుకున్నారు. రతన్ టాటా మరణంతో చాలా మంది అభిమానులు తీవ్రదీప్ బ్రాందీకి గురవుతూ ఉండగా పలువురు నేతలు కూడా తమ బంధాన్ని వివరిస్తూ పోస్ట్లు షేర్ చేస్తున్నారు. విద్యా నుంచి ఆరోగ్య వరకు అన్ని కార్యక్రమాలలో కూడా ఈయన ఎంతో మంది సహాయం చేశారు. అయితే రతన్ టాటా మరణించే సమయానికి ఆయన వయసు 86 సంవత్సరాలు. ఈయన విదేశాలలో తన చదువుని పూర్తి చేసుకొని.. మొదటిసారి టాటా గ్రూప్స్ కంపెనీకి అసిస్టెంట్ గా కూడా చేరారట. ఆ తర్వాత జంషెడ్పూర్ లో శిక్షణ తీసుకొని తన బాధ్యతలను సైతం నిర్వహించారట.