జలపాతం ఉగ్రరూపం ఎప్పుడైనా చూసారా.. వైరల్ వీడియో?

praveen
వాటర్ఫాల్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రకృతి సౌందర్యమే. పెద్ద కొండపై నుంచి నీరు కిందికి దుముకుతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ఇక ఇలాంటి ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు ఎంతో మంది తరలి వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే వర్షాకాలంలో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కువగానే దర్శనమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వాటర్ఫాల్ దగ్గరికి వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ.. కాసేపు అక్కడ గడిపితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అని అనుకుంటూ ఉంటారు అందరూ.

 అయితే ఇలా వాటర్ ఫాల్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సుందరమైన ప్రదేశమే. కానీ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ని చూస్తే మాత్రం వెన్నలో వణుకు పుడుతుంది. అదేంటి వాటర్ఫాల్ అంటున్నారు వెన్నులో వణుకు పుడుతుంది అంటున్నారు. జలపాతం అంటేనే ఒక అందమైన ప్రదేశం కదా. అలాంటి జలపాతాన్ని చూస్తే ఎందుకు వణుకు పుడుతుంది అని అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలు ఎంతలా ముంచెత్తుతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. నదులు సైతం ఎన్నో గ్రామాలను ముంచేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఈ భారీ వరదలు నేపథ్యంలో ఇక ఇప్పుడు పాలనురగల  జాలువారె నీటి దృశ్యాలతో అందంగా కనిపించే వాటర్ ఫాల్స్ సైతం అందరిని భయపెడుతుంది. అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఈ వాటర్ ఫాల్ కూ వరద పోటెత్తింది. దీంతో పర్యాటకుల సందర్శనకు రావద్దు అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతిస్తాము అంటూ చెప్పుకొచ్చారు అధికారులు.Your browser does not support HTML5 video.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: