వైరల్: కారుని ఇలా కూడా నడపవచ్చా.. వీడియో వైరల్..!!
అసలు విషయంలోకి వెళితే ఒక డ్రైవర్ maruthi alto కార్ ను ప్యాసింజర్ సీట్లో ఉంటూ తన కాలితో డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారుతున్నది..టెస్లాల్టో" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రకారం ఈ వ్యక్తి తన కారులో క్యాజువల్ గానే సీటు పైన పడుకొని స్టీరింగ్ వీల్ ని తన పాదంతో తిప్పుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్నది.ఇలా డ్రైవింగ్ చేస్తున్న ఇతనేని చూసి తన పక్కనే ప్రయాణిస్తున్న మరో కారులోని వ్యక్తి రికార్డ్ చేయడం జరిగిందట.
టెస్లాల్టో" అనేది టెస్లా, ఆల్టో కార్లను కలిపితే వస్తుందట.. ఎలాన్ మాస్క్ బ్రాండ్ నుంచి తయారుచేసిన EV వాహనాల మాదిరిగానే ఈ ఆల్టో కారు ఆటోమేటిక్ గేర్ సిస్టం నడుస్తుంది. అయితే ఈ వీడియో మాస్క్ ను ట్యాగ్ చేయడం జరిగింది.. ట్విట్టర్లు ఈ వీడియో వైరల్ గా మారడంతో కొన్ని నిమిషాలకే లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ వచ్చినట్టుగా తెలుస్తున్నది.. ఇలాంటి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న డ్రైవర్లు లాగే టెస్లా కూడా ఇండియాకి రాకపోయి ఉండవచ్చని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
ఈ డ్రైవర్ యొక్క నైపుణ్యాలను చూసి చాలామంది ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఉండగా మరి కొంతమంది ఇలాంటి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తున్నది.