క్రియేటివిటీ పీక్స్.. చెక్కలతో వాషింగ్ మిషన్ ఏంటి గురూ?
ఇలా ఇటీవల కాలంలో కొంతమంది క్రియేటివిటీ చూసి నెటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది ఇటీవల కాలంలో వాషింగ్ మిషన్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ వాషింగ్ మెషిన్ ద్వారానే బట్టలు ఉతకడం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు చాలామంది చాలా రకాలైన వాషింగ్ మిషన్లు చూసే ఉంటారు. కానీ మీరు చూడబోయే వాషింగ్ మిషన్ మాత్రం కలలో కూడా ఊహించని రీతిలో ఉంది. ఏకంగా ఇక్కడ ఒక వ్యక్తి తన క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి వాషింగ్ మిషన్ తయారు చేశాడు.
ఇక ఈ వీడియో ట్వెటర్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది ఏదో కంపెనీలో తయారు చేసిన వాషింగ్ మిషన్ కాదు.. ఏకంగా ఇంట్లో చేతులతో తయారు చేసిన వాషింగ్ మిషన్. ఇది చెక్కలతో తయారుచేసిన బకెట్ వాషింగ్ మిషన్. పైనుండి వాటర్ పడుతూ ఉంటే ఇక కట్టెతో తయారు చేసిన బకెట్లో వాషింగ్ మెషిన్ లో లాగానే బట్టలు వాష్ అవుతున్నాయి అని చెప్పాలి ఇక మరోవైపు నుంచి ఇక బట్టలను వాషింగ్ చేసిన నీళ్లు కిందికి వెళ్ళిపోతూ ఉండడం ఈ వీడియోలో చూడవచ్చు.