జనసేన పార్టీకి బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్..!!

Divya
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ పైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తీవ్రమైన విమర్శలు కూడా చేయడం జరిగింది.. పవన్ కళ్యాణ్ చేసేది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ విరుచుకు పడడం జరిగింది. ఇదే సమయంలో టిడిపి దద్దమ్మలు చంద్రబాబు మాటలు విని పోలీసుల పైన దాడులు చేస్తూ ఉండడం చూసి చాలా ఆగ్రహం వేస్తోంది. పప్పు నారా లోకేష్ ను సీఎం చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని తెలియజేశారు పాల్.

 శనివారం రోజున కేఏ పాల్ పప్పు లోకేష్ కే మన ఓటు అంటూ ఫ్లెక్సీ పెట్టి మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విశాఖలో నారహి యాత్రను ఉపసమహరించుకోవాలి.. పవన్ కళ్యాణ్ ని చూసి మోడీ కూడా మొహం చాటేశారు పవన్ మీద ఏవైనా ఇరిగేషన్ కేసులు ఉన్నాయా విభజన హామీల కోసమే పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు కేఏ పాల్. పవన్ వారాహి యాత్రకు వెళితే 500 చంద్రబాబు యాత్రకు వెళితే 1000 ఇస్తున్నారని తెలియజేశారు.
వీటితో పాటే జనసేన పవన్ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది.. జనసేన పార్టీని తన ప్రజాశాంతి పార్టీలో విలీనం చేస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని తెలియజేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం లోకేష్ అనే పప్పును ముఖ్యమంత్రి చేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా విమర్శించడం జరిగింది కేఏ పాల్. పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయినప్పటికీ పెద్దగా జనాలు రావడం లేదని తెలియజేశారు. ఇక చంద్రబాబు నాయుడు పులివెందలలో  రూ.50 కోట్లు ఖర్చు చేసి తాను పులిని చెప్పుకుంటున్నారని  ఎద్దేవ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: