వైరల్ : 50 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన జెయింట్ స్వింగ్?

praveen
సాధారణంగా ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెడుతున్నారు అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్ కి వెళ్లడానికి ఎంతగానో ఆసక్తి ఇష్టపడుతూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జిబిషన్ లో ఉన్న అన్ని రకాల మిషన్ లపై ఎక్కి కాస్త ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది కేవలం ఎగ్జిబిషన్ లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే చూసి ఊరుకుంటారు. ఎందుకంటే జాయింట్ వీల్ ఎక్కేందుకు భయపడుతూ ఉంటారు. ఇక ఇటీవల ఎగ్జిబిషన్ ను చూసేందుకు వచ్చే వారికి మరింత ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సరికొత్త మిషన్లు తెర మీదికి వస్తూ ఉన్నాయి.

 ఇక ఇలాంటి వాటిలో జాయింట్ స్వింగ్ అనే మిషన్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఏకంగా భూమ్మీద నుంచి 50 అడుగుల ఎత్తులో కి తీసుకువెళ్లి అక్కడ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. ఇక ఇది ఎక్కడానికి ఎంతోమంది ఇష్ట పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం మరోసారి ఎగ్జిబిషన్ కి వెళ్ళాలంటే భయపడిపోతారు అని చెప్పాలి. ఏకంగా టెక్నికల్ లోపం కారణంగా జాయింటు స్వింగ్ ఏకంగా 50 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో 16 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

 ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ వీడియో పంజాబ్లోని మొహాలి నగరంలో వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. 50 మంది ఎక్కినా తరువాత జాయింట్ స్వింగ్ గాల్లో ఉండగానే ఇక ఒక్క సారిగా 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. అందులో ఎక్కిన వారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. అది 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోవడంతో ఎంతోమంది నడుములు విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇక్కడ  పై మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: