ఇండియాను భయపెడుతున్న HMPV వైరస్.. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

Pulgam Srinivas
చైనాలో ఏదైనా వైరస్ బారిన జనాలు పడుతున్నారు అంటే ప్రపంచమంతా ఒక్క సారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకు ప్రధాన కారణం కరోనా. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వైరస్ చైనాలో పుట్టి దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదిపింది. కరోనా బారిన పాడిన దేశాలు అందులో నుండి బయటపడడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడిప్పుడే కరోనా భారీ నుండి బయటపడి ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలకు చైనా నుండి మరొక వైరస్ ద్వారా పెద్ద ప్రమాదం పొంచి ఉండేలా కనిపిస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... చైనాలో తాజాగా HMPV అనే వైరస్ బలంగా అనేక దేశాల్లోకి విస్తరిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ఇండియా , జపాన్ , హాంగ్ కాంగ్ లోకి విస్తరించినట్లు తెలుస్తోంది. ఇండియాలో కూడా కొంత మంది పిల్లలు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది. ఎక్కువ శాతం చిన్న పిల్లలు ఈ వ్యాధి భారిన పడే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. మరి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం

పిల్లలు HMPV వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే వారికి కచ్చితంగా క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించాలి. అలాగే వారిని తాకే ముందు దాదాపు 20 సెకండ్ల పాటు పరిశుభ్రంగా చేతులు కడుక్కొని అప్పుడే వారిని తాకాలి. ఎక్కువ రద్దీ కలిగిన ప్రదేశాలలో చిన్న పిల్లలను అస్సలు తీసుకొని వెళ్లొద్దు. ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ను వేసుకొని వెళ్ళండి. పిల్లలకు కచ్చితంగా తల్లిపాలు తాగించండి. తల్లిపాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నీళ్లు కూడా తాగించండి. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే ఈ వైరస్ బారిన మీ పిల్లలు పాడే అవకాశం తక్కువ అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: