ఒక ఫ్లాప్ తో సినిమాల స్పీడునే తగ్గించేసిన బ్యూటీ.. హీరోయిన్ తీసుకున్న నిర్ణయానికి షాక్ లో ఫ్యాన్స్..?

frame ఒక ఫ్లాప్ తో సినిమాల స్పీడునే తగ్గించేసిన బ్యూటీ.. హీరోయిన్ తీసుకున్న నిర్ణయానికి షాక్ లో ఫ్యాన్స్..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే మంచి విజయాలు దక్కుతు ఉంటాయో వారి కెరియర్ అద్భుతమైన స్థాయిలో ముందుకు సాగుతుంది అనే అభిప్రాయాలను అనేక మంది వ్యక్త పరుస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువ శాతం సినిమా ఇండస్ట్రీ లో విజయాలు ఉన్న వారికే అవకాశాలు ఎక్కువగా దక్కుతూ ఉంటాయి. వారి కెరియర్ చాలా కాలం అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతూ ఉంటుంది. హీరోయిన్ల విషయంలో కూడా ఇదే ఎక్కువ శాతం జరుగుతుంది.

ఎవరికైతే మంచి విజయాలు దక్కుతూ ఉంటాయో వారికి వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో , అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా విజయాన్ని అందుకున్న ఓ ముద్దు గుమ్మ ఒకే ఒక ఫ్లాప్ మూవీ తో తన స్పీడ్ మొత్తాన్ని తగ్గించేసింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి మృణాల్ ఠాకూర్. ఈ నటి సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతో ఈ నటి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ బ్యూటీ కొంతకకాలం క్రితం ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈమె కల్కి 2898 AD సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. ఇక ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ ఏ సినిమాకు కమిట్ కాలేదు అని తెలుస్తుంది. ఇకపోతే మృణాకి ఠాకూర్ కి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: