ఆది మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే నమ్మడం కష్టమే..?

frame ఆది మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే నమ్మడం కష్టమే..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో నటించిన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ముద్దు గుమ్మలకు అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. అలాంటి నటీమణులకి ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒక వేళ ఆ సినిమాల్లో కూడా ఎక్కువ శాతం మూవీ లు మంచి విజయాలు సాధిస్తే తక్కువ కాలం లోనే ఆ బ్యూటీలు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. కానీ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఓ బ్యూటీ కెరియర్ మాత్రం అంత గొప్పగా ముందుకు సాగలేదు.

ఆ బ్యూటీ మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కీర్తి చావ్లా. ఈ నటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆది మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో కీర్తి చావ్లా తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె వరస పెట్టి సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. ఆది సినిమా తర్వాత ఈమెకు తెలుగులో ఒకటి , రెండు సినిమాల్లో మాత్రమే అవకాశాలు వచ్చాయి. దానితో ఈమె కొంత కాలం తర్వాత సినిమాలకే దూరం అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆది సినిమా హీరోయిన్ అయినటువంటి కీర్తి చావ్లా ఎలా ఉందో తెలుసా ..? ఈమె ప్రస్తుతం చాలా మారిపోయింది. కీర్తి చావ్లా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: