పాన్ ఇండియా సినిమా నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. కారణం?

Divya
టాలీవుడ్ లో విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించిన ప్రకాష్ రాజ్ ఎన్నో పాత్రలలో అద్భుతమైన నటనతో బాగా అలరిస్తున్నారు.  ముఖ్యంగా తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ పండించే  సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. గత కొంతకాలంగా అటు సినిమాలలో రాజకీయాలలో సామాజిక అంశాల పైన కూడా నిరంతరం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ తరచు ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్. తాజాగా ప్రకాష్ రాజ్ ఒక పాన్ ఇండియా సినిమా నుంచి తప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాలో అలాగే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ వంటి పాన్ ఇండియా వంటి చిత్రాలలో కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక భారీ ప్రాజెక్టు నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నారని సినిమా షూటింగ్ సెట్ లోనే డైరెక్టర్ తో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం వల్ల ప్రకాష్ రాజ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీంతో మేకర్స్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ ను తప్పించారనే చర్చ కూడా జరుగుతున్నట్లు సమాచారం.


కానీ ఆ సినిమా పేరు ఏంటి అనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ నటిస్తున్నటువంటి చిత్రాలలో స్పిరిట్ సినిమా నుంచి తప్పించారనే విధంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉండగా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ ది కూడా ఒక పవర్ఫుల్ పాత్ర. అలాంటి పాత్రనుంచే  ఇప్పుడు ప్రకాష్ రాజ్ ను తప్పించినట్లు వార్తలు వినిపించడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: