సూర్య , వెంకీ అట్లూరి సినిమాకు ముహూర్తం ఫిక్స్ .. షూటింగ్ ఎప్పుడంటే..?

frame సూర్య , వెంకీ అట్లూరి సినిమాకు ముహూర్తం ఫిక్స్ .. షూటింగ్ ఎప్పుడంటే..?

Amruth kumar
సౌత్ స్టార్ హీరో సూర్యకు తమిళ్ తో పాటు తెలుగు లోనూ మంచి మార్కెట్ ఉంది .. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే సూర్య సినిమా లు తమిళ్లో కంటే తెలుగు లోనే ఎక్కువ కలెక్షన్లు అందుకుంటాయి .. ఇందుకు సంబంధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి .. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణ గత సంవత్సరం రీ రిలీజ్‌ చేయగా సూపర్ కలెక్షన్లు అందుకుంది .. క్రమంలో సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని ఇక్కడ అభిమానులు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు ..

ఇక ఇప్పుడు సూర్య త్వరలో నే తెలుగు సినిమా చేస్తానని తన గత సినిమా కంగువ ప్రమోషన్ లో చెప్పాడు .. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు తెలుగు అభిమానుల కోరిక నెరవేరబోతుంది .. ధనుష్ కు సార్ , దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ లాంటి భారీ విజయాలు అందించిన వెంకీ అట్లూరి .. ఇప్పుడు సూర్య కు సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ..ఇటీవ‌ల సూర్య‌ను కలిసి ఒక కథ కూడా చెప్పగా ఆయన సినిమా చేయడానికి ఓకే చెప్పాడు .. సూర్యకు జంట‌గా ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ ను అనుకోగా ..

ఇక ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి రీసెంట్ గ్లామర్ బ్యూటీ క‌య‌డు లోహర్ వచ్చి చేరింది .. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రెట్రో సినిమా చేస్తున్నాడు సూర్య . సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది .. దీంతో వెంకీ అట్లూరి సినిమా ను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు .. వచ్చే జూన్ నుంచి వెంకీ అట్లూరి సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు సూర్య .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నాగ వంశి నిర్వహిస్తుండ గా జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు .. ఈ సినిమా తో వెంకీ అట్లూరి సూర్య కు ఎలాంటి హిట్ ఇస్తాడు చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: