బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి దీపికా పదుకొనే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఎన్నో హిందీ సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే 2023 వ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ నటించిన పటాన్ , జవాన్ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండింటిలో కూడా షారుక్ ఖాన్ హీరో గా నటించాడు. ఈ రెండు మూవీ లు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ మూవీ ల ద్వారా దీపిక క్రేజ్ మరింత గా పెరిగింది.
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ప్రభాస్ హీరో గా దిశా పటాని హీరోయిన్ గా కల్కి 2898 AD అనే సినిమాను నాగ్ అశ్విన్ రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దీపిక ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఈమెకు తెలుగులో కూడా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఈ ముద్దు గుమ్మ పెద్ద మొత్తంలోనే ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు రన్బీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం వీరి వివాహ బంధం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే వీరిద్దరికీ పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. దీపికా మరియు తన భర్త అయినటువంటి రణ్వీర్ సింగ్ ఇద్దరికి కలిపి 745 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో దీపికా ది రూ.500 కోట్లు , రణ్‌వీర్ సింగ్ ది రూ.245 కోట్లు అని తెలుస్తోంది. ఈ వార్తల ప్రకారం రన్బీర్ కంటే కూడా దీపిక కి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.