హీరో విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన వైద్యులు..!
అయితే విశాల్ ఎప్పుడూ కూడా సినిమా ఫంక్షన్లలో ఫిట్ గా ఉండేవారు. కానీ ఇటీవలే ఒక ఈవెంట్లో చాలా బక్కగా అయిపోయి వణుకుతూ మాట్లాడడంతో చాలామంది అభిమానులు ఆందోళనపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం పైన పలు రకాల వదంతలు వినిపించాయి. విశాల్ ఇలా బక్కగా అయిపోయి వణుకుతూ మాట్లాడుతూ ఉండడంతో.. సినిమా షూటింగ్లో విశాల్ కు తీవ్రమైన గాయాలయ్యాయని ఆ సమయంలో కంటికి కూడా పెద్ద దెబ్బ తగిలిందనీ అప్పటినుంచి నరాల సమస్య ఏర్పడిందనే విధంగా వార్తలు వినిపించాయి.
అయితే ఈ విషయం పైన విశాల్ అధికారికంగా వైద్యులతో ఒక ప్రకటన కూడా ఇప్పించడం జరిగింది. వైద్యులు విడుదల చేసిన అప్డేట్ ప్రకారం ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని అతను ట్రీట్మెంట్ తీసుకోవాలని అలాగే అతని పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని కూడా తెలియజేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ విశాల్ అభిమానులకు మాత్రం వైరల్ ఫీవర్ వల్ల ఇంత బక్కగా అయిపోతారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా విశాల్ మాత్రం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం డిటెక్టివ్ సీక్వెల్లో నటిస్తున్నట్లు సమాచారం.