సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా సూపర్ క్రేజ్ ఉంది. అలాగే రజనీ కాంత్ నటించిన చాలా సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విజయాలు సాధించడంతో ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ "అపూర్వ రాగంగళ్" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా 1975 ఆగస్టు 18 వ తేదీన విడుదలైంది. దీనితో రజనీ కాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దీనితో రజిని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా రజనీ కాంత్ హీరోగా రూపొందిన నరసింహ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కే ఎస్ రవి కుమార్ తాజాగా తెలియజేశాడు.
రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సౌందర్య , రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ఇక రమ్యకృష్ణ ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటివరకు ఏ తెలుగు సినిమా చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని రజిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా నరసింహ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నట్లు కే ఎస్ రవికుమార్ తాజాగా అధికారికంగా ప్రకటించాడు.