నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ... వెడి అన్నంతో తింటే రుచి వేరు.!
టమాటా నిల్వ పచ్చడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మే నెలలో చాలామంది టమాటా పచ్చడి పెడుతూ ఉంటారు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పేది ఎక్కువ నెలలు ఉండదు. కేవలం వారం రోజులకు మించి ఉండదు. టమాటా, వెల్లుల్లితో చేసే పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ పచ్చడి టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది. మరి ఈ టమాటా వెల్లుల్లి పచ్చడి ఎలా తయారు చేశారు? వీటికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఎందుకు సమాధానం శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఐదు టమాటాలు తీసుకుంటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసి తీసుకోవాలి. ఆ నెక్స్ట్ టమాటా ముక్కలు, ఉల్లిపాయలు వేసి ఓ ఐదు నిమిషాలు వేగాక.. కొత్తిమీర తరుగు కూడా వేసి పచ్చి వాసన పోయేంతవరకు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ పట్టుకోవాలి. ఆ తర్వాత తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి టమాటా పచ్చడి సిద్ధం. ఈ చట్నీ ఎందులోనైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.