తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ రేంజ్ లో కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన ఒకరు. ఈమె ఛలో అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
దానితో ఈమెకు గత కొంత కాలంగా హిందీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పుష్ప పార్ట్ 2 మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీనితో ఈమెకు హిందీ లో మరిన్ని క్రేజీ అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె చాలా హిందీ సినిమాలలో నటిస్తుంది. అందులో భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు ఈ బ్యూటీ విక్కీ కౌశల్ హీరోగా రూపొందుతున్న చావా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని కూడా ఈ సంవత్సరమే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు మూవీలు మంచి విజయాలను సాధిస్తే ఈ బ్యూటీ క్రేజ్ హిందీలో మరింతగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.