వైరల్ : బైక్ నడుపుతూ ఓవరాక్షన్ చేశారు.. చివరికి?

praveen
ఇటీవలకాలంలో వాహన వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ప్రతి ఒక్కరూ కూడా తమకూ నచ్చిన వాహనాలను కొనుగోలు చేసి గ్యారేజ్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే నచ్చిన వాహనంపై వెళ్తు ఉన్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అటు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులు రూల్స్ పాటించాలి అంటూ ఎన్నిసార్లు అవగాహనకార్యక్రమాలు చేపట్టినప్పటికీ అటు వాహనదారులు తీరు మాత్రం ఎక్కడా మార్పు రావడంలేదు.


 వెరసి ఎన్నో దారుణమైన రోడ్డు ఆక్సిడెంట్ల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. ఇక మరోవైపు రోడ్డు ప్రమాదాల కారణంగా తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవాలుగా మారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  తరచూ సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో తెరమీదికి వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో అయితే సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఎంతోమంది ఇక వాహనాలపై విన్యాసాలు చేస్తూ ప్రాణాలను సైతం  పణంగా పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే కొన్నిసార్లు ప్రమాదానికి గురి అవుతూ ఉంటారు.


 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది. ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. ఈ క్రమంలోనే వాహనాన్ని తిన్నగా పోనీయకుండా ప్రమాదకరమైన  విన్యాసం చేస్తూ వెళుతున్నారు. ఇంకేముంది ఉన్నట్టుండి వారు చేస్తున్న విన్యాసం కాస్త బెడిసి కొట్టింది. చివరికి బైక్ స్కిడ్ అయింది. వాహనం  పై ఉన్న ముగ్గురు యువకులు కూడా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇలా స్కిడ్ అయినా వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న ఇతర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు రోడ్డు పక్కకు పరుగులు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: